అయోధ్య రామమందిరం భూమి పూజ ముహూర్తంపై శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి అభ్యంతరం
- ఆగస్టు 5న భూమి పూజ!
- మోదీ చేతుల మీదుగా భూమి పూజకు ఏర్పాట్లు
- మంచి ముహూర్తం కాదన్న స్వరూపానంద
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సన్నాహాలు ఊపందుకుంటున్న తరుణంలో శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. రామ మందిరం భూమి పూజకు ఎంచుకున్న ముహూర్తం సరిగాలేదని అన్నారు. తాము కూడా రామ భక్తులమేనని, ఆలయ నిర్మాణం శుభఘడియల మధ్య ప్రారంభం కావాలనేది తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. రామ మందిరం ఎవరు నిర్మించినా తమకు ఇబ్బందిలేదని, తమకు రాజకీయాలతో సంబంధంలేదని తెలిపారు. అయితే భూమి పూజ కోసం నిర్ణయించిన ఘడియలు మంచివి కావని వెల్లడించారు.
కాగా, అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు భూమి పూజకు తొలుత ఈ నెల 29న ముహూర్తం నిర్ణయించినా, అది ఆగస్టు మొదటివారానికి మారింది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీతో భూమి పూజ చేయించాలన్నది ట్రస్టు పెద్దల అభిమతంగా కనిపిస్తోంది.