తెలంగాణలో 50 వేల మార్కు దాటిన పాజిటివ్ కేసులు
- కొత్తగా 1,567 కేసులు వెల్లడి
- మరో 9 మంది మృత్యువాత
- ఇవాళ 1,661 మంది డిశ్చార్జి
తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 1,567 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును అధిగమించింది. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,826కి చేరింది. తాజాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 662, రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 447కి పెరిగింది. ఇవాళ 1,661 మందిని డిశ్చార్జి చేశారు. మరో 11,052 మంది చికిత్స పొందుతున్నారు.
.