విదేశీ గడ్డపై ఉన్న భారత విద్యార్థుల కోసం స్పైస్ జెట్ తో చేతులు కలిపిన సోనూ సూద్
- కిర్గిజ్ స్థాన్ లో చిక్కుకుపోయిన 1500 మంది విద్యార్థులు
- విద్యార్థులను తరలించేందుకు సోనూ, స్పైస్ జెట్ కార్యాచరణ
- ఇప్పటికే ఢిల్లీ నుంచి బయల్దేరిన 9 విమానాలు
ప్రముఖ నటుడు సోనూ సూద్ సినిమాల ద్వారా సంపాదించుకున్న పేరు ఒకెత్తయితే, లాక్ డౌన్ కాలంలో వలసజీవులను వారి స్వస్థలాలకు చేర్చడం ద్వారా సంపాదించుకునే పేరు మరో ఎత్తు. సినిమాల్లో విలన్ పాత్రలు వేసే సోనూ సూద్ ఒక్కసారిగా రియల్ హీరో అయ్యాడు. ఖర్చుకు వెనుకాడకుండా మానవత్వమే ప్రధానమని చాటి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు.
తాజాగా, విదేశాల్లో చిక్కుకున్న భారత విద్యార్థులను తరలించేందుకు సిద్ధమయ్యాడు. కిర్గిజ్ స్థాన్ లో ఉన్న 1,500 మంది భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు సోనూ సూద్ ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తో చేతులు కలిపాడు. ఈ విషయాన్ని స్పైస్ జెట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"ఇది చారిత్రాత్మకమైన రోజు. రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ తో భాగస్వామ్యం కుదిరింది. జీవితంలో ఒక్కపర్యాయం మాత్రమే సంభవించే ఓ భారీ తరలింపుకు శ్రీకారం చుడుతున్నాం. కిర్గిజ్ స్థాన్ లో చిక్కుకుపోయిన 1,500 మంది భారత విద్యార్థులను వారి కుటుంబాల వద్దకు చేర్చే బృహత్తర కార్యక్రమం ఇది. ఈ తరలింపు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 9 విమానాలు ఢిల్లీ నుంచి బయల్దేరాయి" అని స్పైస్ జెట్ వెల్లడించింది.