సామూహిక అత్యాచారానికి గురైన బాలికను దత్తత తీసుకుంటాం: చంద్రబాబు
- అత్యాచార ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు
- బాధితురాలకి పార్టీ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయం
- బాలికను చదివిస్తామన్న చంద్రబాబు
రాజమండ్రిలో దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి తెలుగుదేశం తరపున తక్షణమే రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ ఘటనపై చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారు. కమిటీ సభ్యులు నిన్న రాజమండ్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. అనంతరం నివేదికను చంద్రబాబుకు అందించారు.
బాలిక పదో తరగతి వరకు చదువుకుందని చంద్రబాబుకు టీడీపీ నేతలు చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, బాలికను దత్తత తీసుకుని చదివిస్తామని చెప్పారు. టీడీపీ అండగా ఉంటుందనే భరోసాను ఆమెకు కలిగించాలని అన్నారు. ఇలాంటి దుర్మార్గాలపై పోరాడే వీరవనితగా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.