పసిడి పరుగులు.. గరిష్ఠ స్థాయికి చేరుకున్న బంగారం ధరలు

  • శ్రావణ మాసం ఎఫెక్ట్
  • ఢిల్లీలో నిన్న 10 గ్రాముల పసిడి ధర రూ. 50,920
  • బంగారం బాటలోనే పయనించిన వెండి
శ్రావణ మాసం అడుగిడడంతోనే బంగారం ధరలు భగ్గుమన్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఈ మాసం నెలవు కావడంతో ధరలు ఊపందుకున్నాయి. పసిడి వైపు చూడడానికే భయపడేలా పరుగులు పెడుతున్నాయి. ఢిల్లీలో నిన్న 10 గ్రాములకు రూ. 430 పెరిగి రూ. 50,920కి చేరుకుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే దేశీయంగానూ ధరలు పెరుగుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ‌స్ తెలిపింది. ముంబైలో ధర 10 గ్రాములకు రూ.50,181గా నమోదైంది. ఇక, హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ. 51,700కు పెరగ్గా, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఢిల్లీలో నిన్న కిలోకు ఏకంగా రూ. 2,550 పెరిగి రూ. 60,400కి చేరుకుంది.


More Telugu News