ఇండియాలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు!
- 63.13 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు
- 2.41 శాతానికి తగ్గిన మరణాల రేటు
- దేశ వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 7,53,049
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ... ఇదే సమయంలో మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 28,472 మంది పేషెంట్లు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో కరోనా పేషెంట్లు రికవర్ కావడం ఇదే తొలిసారి. భారత్ లో ప్రస్తుతం రికవరీ రేటు 63.13కి పెరిగింది.
దేశంలో మరణాల రేటు 2.41 శాతానికి తగ్గింది. జూన్ 17న మరణాల రేటు గరిష్ఠంగా 3.36 శాతంగా నమోదైంది. ఈ శాతం భారీగా తగ్గడం పట్ల కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు ఇప్పటికే దేశ వ్యాప్తంగా 7,53,049 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4,11,133 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి.