సినీ నటి ప్రగతి వర్కౌట్లు.. వైరల్ అవుతున్న వీడియోలు!
- దక్షిణాదిలో దూసుకుపోతున్న క్యారెక్టర్ నటి ప్రగతి
- లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ప్రగతి
- తాజాగా వర్కౌట్లతో అదరగొట్టిన వైనం
తల్లి, అత్త పాత్రలను పోషించే నటీమణుల్లో ప్రగతి ముందు వరుసలో ఉంటారు. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. చేతి నిండా ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా గడిపే ప్రగతి ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా కారణంగా షూటింగులు ఆగిపోవడంతో... కుటుంబసభ్యులతో గడుపుతూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన డ్యాన్సులు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వర్కౌట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
a