తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 58 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 29 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. లాభ, నష్టాల మధ్య కొట్టుమిట్టాడాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. తద్వారా ఐదు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 58 పాయింట్లు నష్టపోయి 37,871కి పడిపోయింది. నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 11,132 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (6.58%), టైటాన్ కంపెనీ (4.93%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.60%), ఐటీసీ (2.39%), ఎన్టీపీసీ (2.26%).
టాప్ లూజర్స్:
హీరో మోటోకార్ప్ (-3.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (-3.11%), టాటా స్టీల్ (-2.42%), ఇన్ఫోసిస్ (-1.92%), మారుతి సుజుకి (-1.80%).