విచారణ నుంచి తప్పించుకోవడానికి కరోనా డ్రామానా?: విజయసాయిరెడ్డిపై వర్ల రామయ్య విమర్శలు
- కరోనా చికిత్స అంటూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉన్నారు
- సీబీఐ అధికారులు మిమ్ములను విచారణ చేసే అవకాశముందా?
- తప్పించుకోడానికి డ్రామా అని మీ సన్నిహితులు అంటున్నారు
- ఏది నిజం, ఏది వైరల్?
కరోనాకు చికిత్స తీసుకోవడం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'విజయ సాయి రెడ్డి గారూ.. కరోనా చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మీరు ఉంటే, సీబీఐ అధికారులు మిమ్ములను విచారణ చేసే అవకాశం వుంటుందా? విచారణ తప్పించుకోడానికి ఆసుపత్రి డ్రామా అని మీ సన్నిహితులు అంటున్నారు. ఏది నిజం, ఏది వైరల్? ఈ ఒక్క నిజం మీ నోట వినాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు' అని టీడీపీ నేత వర్ల రామయ్య ట్వీట్లు చేశారు.
కాగా, ఒక దళిత యువకుడిపై చీరాల పోలీసులు ప్రవర్తించిన తీరుపై వర్ల రామయ్య స్పందిస్తూ... 'మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని చీరాల పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొడితే, అతను చనిపోయాడు. మాస్క్ పెట్టుకోకపోతే చచ్చేంత కొడతారా? మరి మన రాష్ట్రంలో చాలా మంది "పెద్దలు" మాస్క్ పెట్టుకోకుండా "పరిపాలన" చేస్తున్నారు, వారిని ఏమి చేస్తారు? లాఠీలకు పని చెపుతారా, జీ హుజూర్ అంటారా?' అని వర్ల రామయ్య ప్రశ్నించారు.