కరోనా బారినపడ్డ బాధితులు బెడ్లు, వెంటిలేటర్లు అందించాలని వేడుకుంటున్నారు: దేవినేని ఉమ

  • కరోనా కేసులు రోజుకి 5,000 దాటుతున్నాయి
  • మరణాలు 700 దాటాయి
  • ప్రజలకి భరోసా కల్పించడానికి ఏం చర్యలు తీసుకున్నారు  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్‌-19 మృత్యు ఘంటికలు మోగిస్తూ రికార్డు స్థాయిలో ప్రాణాలను బలితీసుకుంటోన్న విషయంపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

'కరోనా కేసులు రోజుకి 5,000 దాటుతున్నాయి, మరణాలు 700 దాటాయి. కరోనా బారినపడ్డ బాధితులు బెడ్లు, వెంటిలేటర్లు అందించాలని వేడుకుంటున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి, జర్నలిస్టులకి, ప్రజలకి భరోసా కల్పించడానికి ఏం చర్యలు తీసుకున్నారు జగన్ గారు?'  అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

కాగా, ఏపీలో కరోనా విజృంభణను తెలుపుతూ వచ్చిన పలు వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. ఏపీలో ఐదు రోజుల నుంచి వరుసగా నాలుగు వేల పైనే కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజులో 4,944 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఏపీలో మొత్తం బాధితుల సంఖ్య 58,668కి చేరింది. కరోనా కేసుల సంఖ్యలో ఏపీ దేశంలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.


More Telugu News