అయోధ్య రామాలయ నిర్మాణంలో ఉడుపి మట్టి.. పర్యాయ అడ్మర్ పీఠం నుంచి సేకరణ

  • ఇత్తడి కలశంలో ఉంచి ప్రత్యేక పూజలు
  • గర్భాలయం వచ్చే చోట ఐదు గ్రహాలకు ప్రతీకలుగా ఐదు వెండి ఇటుకలు
  • శంకుస్థాపనకు దూరంగా  పెజావర్ మఠాధిపతి
అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన పనులు ఊపందుకుంటున్నాయి. ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేసేటప్పుడు పుణ్యక్షేత్రాలు, నదులు, పవిత్ర ప్రదేశాల నుంచి మట్టిని, జలాలను తీసుకెళ్లాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రసిద్ధ క్షేత్రమైన ఉడుపిలోని పర్యాయ అడ్మర్ పీఠం నుంచి మట్టిని సేకరించింది. ఇత్తడి కలశంలో ఉంచిన మట్టికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వీహెచ్‌పీ నేతలకు అందించారు.

హిందూ పురాణాల ప్రకారం ఐదు గ్రహాలకు ప్రతీకలుగా నిలిచేలా రామాలయ గర్భాలయం వచ్చే చోట ఐదు వెండి ఇటుకలను ఉంచనున్నట్టు రామ మందిర ట్రస్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, చాతుర్మాస వ్రత దీక్షలో ఉన్న పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థస్వామి రామాలయ శంకుస్థాపనకు హాజరు కాబోవడం లేదని సమాచారం.


More Telugu News