ఇంత చెబుతున్నా మాస్కులు లేకుండా తిరిగితే మనకు, పశువులకు తేడా ఉండదు: కొరటాల శివ

  • మాస్కుల్లేకుండా తిరగడంపై కొరటాల ఆవేదన
  • కరోనా నివారణకు మాస్కు ఒక్కటే మార్గమని వెల్లడి
  • దయచేసి మాస్కులు వేసుకుందాం అంటూ విజ్ఞప్తి
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కుల ప్రాధాన్యత ఎనలేనిది. వైద్యుల నుంచి ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరూ మాస్కును అత్యుత్తమ రక్షణ కవచంగా ప్రచారం చేస్తున్నారు. అయితే సమాజంలో ఇప్పటికీ కొందరు మాస్కులు ధరించకపోవడం పట్ల టాలీవుడ్ సినీ దర్శకుడు కొరటాల శివ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత చెబుతున్నా మాస్కులు ధరించకుండా తిరిగితే బొత్తిగా మనకు, పశువులకు తేడా ఉండదు అని ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి మాస్కు ధరించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. దయచేసి మాస్కులు వేసుకుందాం అంటూ విజ్ఞప్తి చేశారు. అయితే, మాస్కు వేసుకునేది మెడ మీద కాదు... ముక్కు, మూతి కవరయ్యేలా ధరించుదాం అని స్పష్టం చేశారు. ఇక మాస్కు వేసుకోని వాళ్లకు ప్రత్యేకంగా చెబుదాం అంటూ పేర్కొన్నారు.


More Telugu News