ఒక్కరోజులో రూ.97 వేల కోట్లు వచ్చిపడ్డాయి... అమెజాన్ అధినేత రికార్డు

  • స్టాక్ మార్కెట్లో పెరిగిన అమెజాన్ షేరు విలువ
  • సానుకూల రేటింగ్ ఇచ్చిన గోల్డ్ మన్ శాక్స్
  • 189 బిలియన్ డాలర్లకు పెరిగిన బెజోస్ సంపద
గత కొంతకాలంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా కొనసాగుతున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద మరింత పెరిగింది. వెబ్ షాపింగ్ ట్రెండ్స్ పై ఆశావహ అంచనాల నేపథ్యంలో అమెజాన్ షేరు విలువ అమాంతం పెరగడంతో, జెఫ్ బెజోస్ కు ఒక్కరోజులోనే రూ.97 వేల కోట్లు వచ్చిపడ్డాయి. ఇప్పటివరకు ఓ వ్యక్తి ఒక్కరోజులో ఇంత మొత్తం సంపాదించింది లేదు. ఇప్పుడీ ఘనత బెజోస్ సొంతమైంది. దాంతో ఆయన సంపద విలువ 189 బిలియన్ డాలర్లకు చేరింది.

ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయన 74 బిలియన్ డాలర్లు ఆర్జించారంటే అమెజాన్ ప్రాభవం ఎంతలా వెలిగిపోతుందో చెప్పవచ్చు. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్ మన్ శాక్స్ కూడా అమెజాన్ షేర్లపై సానుకూల రేటింగ్ ఇవ్వడంతో స్టాక్ మార్కెట్లో అమెజాన్ ప్రభంజనం కొనసాగింది. అమెజాన్ షేరు 2018 డిసెంబరు తర్వాత ఈ స్థాయిలో లాభపడడం ఇదే ప్రథమం.


More Telugu News