జూలై 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు: సచిన్ పైలట్‌కు భారీ ఊరటనిచ్చిన హైకోర్టు

  • పైలట్ తో పాటు 18 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు
  • సమాధానం ఇవ్వడానికి మూడు రోజుల గడువు
  • హైకోర్టును ఆశ్రయించిన పైలట్ అండ్ కో
రాజస్థాన్ రాజకీయం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీ రెబెల్ నేత సచిన్ పైలట్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జూలై 24 వరకు అనర్హతపై ఎలాంటి చర్యలను తీసుకోవద్దని స్పీకర్ జోషిని ఆదేశించింది.

సచిన్ పైలట్ తరపున హైకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ... స్పీకర్ జోషి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని చెప్పారు. పైలట్ తో పాటు 18 మంది ఎమ్మెల్యేలకు ఎలాంటి కారణం లేకుండానే నోటీసులు జారీ చేశారని అన్నారు. నోటీసులకు మూడు రోజుల్లోనే సమాధానం చెప్పాలని గడువు విధించారని... దీన్ని బట్టే స్పీకర్ అంతరంగం ఏమిటో అర్థమవుతోందని చెప్పారు. రోహత్గి వాదనతో ఏకీభవించిన కోర్టు జూలై 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్ ను ఆదేశించింది.

ఇటీవల రాజస్థాన్ సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్  తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో, వారందరికి  స్పీకర్ అనర్హత నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పైలట్ హైకోర్టును ఆశ్రయించారు.


More Telugu News