గుండెపోటుతో మృతి చెందిన కురుపాం మాజీ ఎమ్మెల్యే

గుండెపోటుతో మృతి చెందిన కురుపాం మాజీ ఎమ్మెల్యే
  • గుండెపోటుతో కుప్పకూలిన జనార్దన్
  • విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • విషాదంలో టీడీపీ నేతలు
విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే, శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు జనార్దన్ థాట్రాజ్ మరణించారు. గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని జనార్దన్ ప్రయత్నించారు. అయితే, కురుపాంలో ఆయన వేసిన నామినేషన్ కులవివాదం కారణంగా తిరస్కరణకు గురైంది. జనార్దన్ మృతి వార్తతో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. కాగా, ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News