తెలంగాణలో ఇవాళ 1,885 మంది డిశ్చార్జి... కొత్తగా 1,198 కేసుల నమోదు

  • 46 వేలు దాటిన పాజిటివ్ కేసులు
  • తాజాగా మరో ఏడుగురి మృతి
  • ఖాళీగా ఉన్న పడకల వివరాలు వెల్లడించిన ప్రభుత్వం
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,198 కరోనా కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 610 మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కి చేరింది. తాజాగా మరో ఏడుగురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 422కి పెరిగింది. ఇక, నేడు మరో 1,885 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 11,530 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ లో తెలిపారు.

అయితే, ఎప్పుడూ కరోనా గణాంకాలు మాత్రమే వెల్లడించే ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో ఆ వివరాలు కూడా వెల్లడించింది. మొత్తం 17,081 పడకల్లో 2,122 భర్తీ అయ్యాయని, ఇంకా 14,959 ఖాళీగా ఉన్నాయని వివరించింది. ప్రత్యేకించి గాంధీ ఆసుపత్రిలో మొత్తం బెడ్లు 1,890 కాగా, ఇంకా 1,171 బెడ్లు ఖాళీగా అందుబాటులోనే ఉన్నాయని బులెటిన్ లో వివరించారు.


More Telugu News