తెలంగాణకు భారీ వర్ష సూచన
- మరాఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి
- చురుగ్గా ఉన్న రుతుపవనాలు
- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అధిక వర్షపాతం
మరాఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, మరోవైపు రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయని, దీని కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో హైదరాబాద్ పాటు నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.