ఫ్రీ డెలివరీ, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన జియోమార్ట్ 

  • 200 పట్టణాలలో ప్రారంభమైన జియోమార్ట్ సేవలు
  • రోజుకు 2.50 లక్షల ఆర్డర్లు
  • ధరలపై 5 శాతం డిస్కౌంట్ 
ఫ్లిప్ కార్ట్ సూపర్ మార్కెట్, అమెజాన్ ప్యాంట్రీ, బిగ్ బాస్కెట్ వంటి వాటికి పోటీగా రిలయన్స్ సంస్థకు చెందిన జియోమార్ట్ రంగంలోకి దిగింది. జియోమార్ట్ కు సంబంధించిన ఐఓఎస్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ కూడా వచ్చాయి. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి జియోమార్ట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తాజాగా జియో మార్ట్ సేవలు 200 పట్టణాల్లో ప్రారంభమయ్యాయి. జియోమార్ట్ యాప్ నుంచి కావాల్సిన వాటిని ఆర్డర్ చేయవచ్చు. ఎంత తక్కువ ఆర్డర్ చేసినా ఫ్రీ డెలివరీ ఉంటుందని జియోమార్ట్ ఈ సందర్భంగా తెలిపింది. ధరలపై ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా ఇస్తామని ప్రకటించింది.

ప్రస్తుతం ప్రతిరోజూ 2.50 లక్షల ఆర్డర్లు వస్తున్నాయని జియోమార్ట్ తెలిపింది. ఆర్డర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది. పేటీఎం, మొబీక్విక్ వంటి పేమెంట్ ఆప్షన్స్  ద్వారా డబ్బులు చెల్లించే వారికి క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుందని చెప్పింది. ఇన్నిరోజులు జియోమార్ట్ వెబ్ సైట్ నుంచే ఆర్డర్ చేయాల్సి వచ్చేదని... ఇప్పుడు యాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చని తెలిపింది. జియో మార్ట్ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ కూడా లభిస్తాయి.


More Telugu News