తన డ్రైవర్ కు కరోనా సోకడంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
- శివప్రసాద్ రెడ్డి కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్
- కడప ఫాతిమా ఆసుపత్రికి డ్రైవర్ తరలింపు
- ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న ఎమ్మెల్యే
ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కడప జిల్లాలో కూడా భారీ సంఖ్యలో కేసులు వస్తున్నాయి. తాజాగా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో అతనిని కడప పట్టణంలోని ఫాతిమా కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పట్టణంలో కేసులు పెరుగుతుండడం, తన డ్రైవర్ కు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో రెండు వారాల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఇంటి వద్దే ఉంటూ కరోనా కట్టడిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.