హేయ్ పీకే ఫ్యాన్స్.. 'యే హమారా ఇజ్జత్ కా సవాల్ హై' అంటూ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
- 'పవర్ స్టార్' సినిమాలోని 'గడ్డి తింటావా?' పాటపై పీకే ఫ్యాన్స్ ఆగ్రహం
- యూట్యూబ్‌లో డిస్‌లైక్‌లు
- సెటైర్లు వేసిన వర్మ
- మరిన్ని డిస్‌లైక్‌లు కొట్టాలని సవాల్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' పేరిట ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని 'గడ్డి తింటావా?' అనే పాటను నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఆయన విడుదల చేశారు. దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు.
యూట్యూబ్‌లో ఈ పాటకు డిస్‌లైక్‌లు కొడుతూ, వర్మను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, దీనిపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. 'పవర్ స్టార్ సాంగ్‌కు 5 గంటల్లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ, కేవలం 20 వేల డిస్‌లైక్‌లు మాత్రమే వచ్చాయి. ఒక పీకే ఫ్యాన్‌గా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే కేవలం 20 వేల డిస్‌లైక్‌లు మాత్రమే వచ్చాయి. పీకేకు ఇంత తక్కువగా ఫ్యాన్స్ ఉన్నారా?' అని ఆయన ట్వీట్లు చేశారు.
పవర్ స్టార్‌ను రక్షించడానికి తాను రెడీగా ఉన్నానంటూ కొడవలి పట్టుకుని, లుంగీ కట్టుకుని ఉన్న తన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. 'హే పీకే ఫ్యాన్స్.. మీరు మరింత చురుకుగా ఉండాలి.. మరిన్ని డిస్‌లైక్స్ కొట్టాలి. యే హమారా ఇజ్జత్ కా సవాల్ హై' అని ఆయన చురకలంటించారు.
కాగా, ఈ నెల 22న విడుదల కానున్న పవర్ స్టార్ సినిమా ట్రైలర్‌ను చాలా మంది కొనుక్కుని చూడనున్నారని వర్మ అన్నారు. అలాగే, రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ట్రైలర్‌ను రూ.150 లేక రూ.200 కు అమ్మితే ట్రైలర్‌కే నిర్మాతలకు మొత్తం డబ్బులు తిరిగి వచ్చేస్తాయని, ఇక సినిమాను ఉచితంగా విడుదల చేయొచ్చని చెప్పారు.