మరింత బలోపేతం కానున్న భారత వాయుసేన.. 29న మరో 5 రాఫెల్ విమానాల రాక
- ‘గోల్డెన్ యూరోస్’ బృందంలో చేరనున్న విమానాలు
- వీలైనంత త్వరగా వాడుకలోకి తీసుకురావాలని నిర్ణయం
- ఎయిర్ చీఫ్ మార్షల్ నేతృత్వంలో బుధ, గురువారాల్లో సమావేశం
రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ నెల 29న మరో 5 విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయి. వీటి చేరికతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. ఈ ఐదు విమానాలను ‘గోల్డెన్ యూరోస్’ బృందంలో వాయుసేన చేర్చనుంది. ఐఏఎఫ్‌లో చేరనున్న ఈ విమానాలను వీలైనంత త్వరగా వాడుకలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో బుధ, గురువారాల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భడౌరియా నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా వాటి ఉపయోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు.
గల్వాన్ ఘటన తర్వాత చైనాతో పెరిగిన సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రాఫెల్ యుద్ధ విమానాల రాక భారత వాయుసేనకు మరింత బలాన్ని చేకూర్చనుంది. కాగా, భారత వాయుసేన ఇప్పటికే సుఖోయ్-30ఎంకేఐ, మిరాజ్-2000, మిగ్-29, జాగ్వార్ వంటి యుద్ధ విమానాలను, అపాచీ హెలికాప్టర్లు, భారీ బరువులను మోసుకెళ్లే చినూక్ హెలికాప్టర్లను మోహరించింది.