కాఫీతోటలోకి చొరబడుతున్నాయని.. అరటిపండ్లలో విషం పెట్టి 20 ఆవుల ప్రాణాలు తీశారు!
- కర్ణాటకలోని కొడగు జిల్లాలో అమానవీయం
- ఆవులకు విషం పెట్టి చంపి పూడ్చేసిన వైనం
- వెల్లువెత్తుతున్న విమర్శలు
కర్ణాటకలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. కాఫీ తోటలోకి ఆవులు చొరబడుతున్నాయన్న కారణంతో అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అరటి పండ్లలో విషం పెట్టి 20 గోవుల ప్రాణాలు తీశారు. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్‌లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమీప గ్రామాలకు చెందిన పశువులు ఐగూరు ఎస్టేట్ వైపు మేత కోసం వెళ్లేవి. ఎస్టేట్‌లోకి ప్రవేశించిన ఆవులు కాఫీ తోటలను పాడు చేస్తున్నాయంటూ ఎస్టేట్ మేనేజర్, ఇతర సిబ్బంది అరటిపండ్లలో విషం పెట్టి గోవులకు తినిపించేవారు. ఆ వెంటనే అవి చనిపోయేవి. అయితే, విషయం బయటపడకుండా ఎస్టేట్‌లోనే పెద్ద గొయ్యి తవ్వి ఆవులను అందులో పూడ్చి పెడుతూ వచ్చారు. ఇలా ఇప్పటి వరకు 20 ఆవుల్ని బలిగొన్నారు.
తమ పశువులు కనిపించకపోవడంతో వాటి యజమానులు వెతుక్కుంటూ నిన్న ఎస్టేట్‌వైపు రాగా, ఓ గొయ్యిలో వాటి కళేబరాలు కనిపించాయి. అనుమానించిన వారు ఎస్టేట్ సిబ్బందిని నిలదీయడంతో విస్తుపోయే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆవుల యజమానుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.