హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్ చేసిన మంచు లక్ష్మి
- పోలీసులను సూపర్ హీరోలతో పోల్చిన మంచు లక్ష్మి
- సొంత కుటుంబాల కంటే ప్రజల కోసమే పాటుపడుతున్నారని కితాబు
- ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపినా రుణం తీరదని వ్యాఖ్యలు
కరోనా రక్కసిపై పోరాటంలో ముందు నిలిచి పోరాడుతున్న పోలీసులు నిజమైన సూపర్ హీరోలని టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి అభివర్ణించారు. తమకు కూడా కుటుంబాలు ఉన్నప్పటికీ ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోలీసులు సేవలు అందిస్తున్నారని, అందుకే హైదరాబాద్ పోలీసులందరికీ సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు.
లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో కళ్లారా చూస్తున్నామని, తెలంగాణ ప్రాంతంలో 98 మంది పోలీసు అధికారులకు కరోనా సోకి డ్యూటీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వాళ్లందరూ కోలుకుని విధుల్లో చేరారని విన్నానని, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, రాముడు, హనుమంతుడు, కృష్ణుడు అని పుస్తకాల్లో చదువుకున్నామని, కానీ పోలీసులే ప్రత్యక్ష దైవాలని పేర్కొన్నారు. పోలీసులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపినా రుణం తీరదని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ట్విట్టర్ లో పంచుకున్నారు.