ఏపీలో కరోనాతో 56 మంది మృతి... ఒక్కరోజులో రికార్డుస్థాయిలో 5 వేలకు పైగా కేసులు
- 642కి చేరిన మరణాల సంఖ్య
- 49 వేలకు పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య
- ఇంకా 26 వేల మందికి చికిత్స
కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. అటు మరణాలు, ఇటు కొత్త కేసులు అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 56 మంది మృత్యువాత పడగా, గడచిన 24 గంటల్లో 5,041 మందికి పాజిటివ్ అని తేలింది. దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 49,650కి చేరింది.
మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుండడం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది, శ్రీకాకుళం జిల్లాలో 8 మంది, కర్నూలు జిల్లాలో ఏడుగురు, విశాఖ జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. దాంతో ఇప్పటివరకు కరోనా మరణించిన వారి సంఖ్య 642కి పెరిగింది. ఇక, కొత్తగా 1,106 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 26,118 మంది చికిత్స పొందుతున్నారు.