మంగళగిరి నియోజకవర్గం జర్నలిస్టులకు ఉచిత బీమా ప్రకటించిన నారా లోకేశ్
- 62 మంది జర్నలిస్టులకు బీమా వర్తింపు
- ప్రీమియం చెల్లించిన లోకేశ్
- రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ బీమా చేయించాలని డిమాండ్
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ రోజుల్లో విధి నిర్వహణలో అనేకమంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతుండడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. మంగళగిరి నియోజకవర్గంలోని 62 మంది జర్నలిస్టులకు లోకేశ్ ఉచిత బీమా సౌకర్యం ప్రకటించారు. సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల మేర లబ్ది పొందేలా బీమా కల్పించారు.
కరోనా మరణాలకు కూడా బీమా వర్తింపజేసేలా తీసుకువచ్చిన ఈ పాలసీలకు ప్రీమియంను నారా లోకేశ్ చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం బీమా చేయించాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని అన్నారు.