ఎంతో గట్టిదైన టీమిండియాలో ఒకే ఒక్క మానసిక బలహీనుడు గంభీర్: మళ్లీ నోరు పారేసుకున్న అఫ్రిదీ

  • చాలాకాలంగా గంభీర్, అఫ్రిదీ మధ్య వైరం
  • గంభీర్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడన్న అఫ్రిదీ
  • మాజీ కండిషనింగ్ కోచ్ వ్యాఖ్యలను ప్రస్తావించిన వైనం
టీమిండియా దిగ్గజం గౌతమ్ గంభీర్ పై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ప్రపంచంలోనే మానసికంగా అత్యంత గట్టి జట్టు అని, ఆ జట్టులో గంభీర్ అందరికంటే మానసిక బలహీనుడు అని వ్యాఖ్యానించాడు. గంభీర్ ఆటతీరును తాను కూడా ఇష్టపడతానని, కానీ అతడు ఏదో మానసిక సమస్యలతో బాధపడుతున్నాడన్నది తన అభిప్రాయమని అఫ్రిదీ పేర్కొన్నాడు.

ఓ ఇంటర్వ్య్లూలో మాట్లాడుతూ అఫ్రిదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా, గతంలో టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్ గా పనిచేసిన ప్యాడీ ఆప్టన్ వ్యాఖ్యలను కూడా ప్రస్తావించాడు. అఫ్రిదీ ఎప్పుడూ ఏదో ఒక మానసిక ఒత్తిడికి లోనవుతుండేవాడని, దానిపై ఎన్నోసార్లు చర్చించినా అతడిలో మార్పు కనిపించేది కాదని ఆప్టన్ తన పుస్తకంలో పేర్కొన్న విషయాన్ని అఫ్రిదీ ఎత్తిచూపాడు.


More Telugu News