భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి బిడెన్‌ మద్దతిస్తారు: రిచర్డ్ వర్మ

  • ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
  • బిడెన్‌ తరఫున ఎన్నికల ప్రచారం
  • భారత దేశానికి పూర్తి మద్దతు ఇస్తారన్న వర్మ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌పై జో బిడెన్ గెలిస్తే ఆయన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశం శాశ్వత సభ్యత్వం పొందేందుకు సాయపడతారని అమెరికాలోని భారత మాజీ రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. ఈ ఏడాది నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్‌ తరఫున ఆయన పనిచేస్తున్నారు. అమెరికాలోని భారత సంతతి ప్రజలు ఆయనకే మద్దతివ్వాలని  రిచర్డ్ వర్మ పిలుపునిస్తున్నారు.

అమెరికాలో జో బిడెన్ గెలిస్తే అక్కడ భారత ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ఇండియాతో కలిసి ఆయన పని చేస్తారని చెప్పారు. అలాగే, సీమాంతర ఉగ్రవాదానికి బిడెన్‌ వ్యతిరేకంగా నిలుస్తారని చెప్పారు. భారత దేశ పొరుగు దేశాలు కయ్యానికి కాలు దువ్వితే ఇండియాకు బిడెన్ మద్దతిస్తారని ఆయన తెలిపారు. కాగా, భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా చైనా అభ్యంతరాలు తెలుపుతోన్న విషయం తెలిసిందే. దీంతో అందులో భారత్‌కు శాశ్వత సభ్యత్వం జాప్యం జరుగుతోంది.



More Telugu News