ఏపీలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. కేంద్రానికి తెలిపిన ప్రభుత్వం

  • ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
  • బడుల సురక్షిత ప్రణాళికపై వివరాలు కోరిన కేంద్రం
  • ఎలాంటి నిర్ణయం తీసుకోని తమిళనాడు, తెలంగాణ
పాఠశాలల పునఃప్రారంభానికి ఏపీ సమాయత్తమవుతోంది. సెప్టెంబరు 5 నుంచి బడులు తెరిచేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేసింది. బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఆగస్టులో స్కూళ్లు తిరిగి తెరవనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

పాఠశాలల సురక్షిత ప్రణాళికపై ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. పాఠశాలలను తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పాలని ఈ సందర్భంగా కోరింది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ ప్రణాళికలను వివరించగా, వీటిలో ఏవైనా మార్పులు ఉంటే చెప్పాలంటూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. నిజానికి ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని తొలుత కేంద్రానికి తెలిపిన రాష్ట్రం ఇప్పుడు  సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించనున్నట్టు తెలిపింది.


More Telugu News