ప్రభాస్ సరసన దీపిక పదుకుణె.. సర్‌ప్రైజ్ చేస్తూ అధికారిక ప్రకటన
- ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోయిన్‌గా పూజ హెగ్డే
- ఆ తర్వాతి సినిమాలో దీపిక
- భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ మూవీగా ప్రభాస్ సినిమా
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి', ఆ తర్వాత సాహోలో నటించిన అనంతరం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇది ఆయనకు 20వ సినిమా. ఆ తర్వాతి సినిమా గురించి ఇప్పటికే స్పష్టత వచ్చింది. ప్రభాస్ 20వ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, 21వ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకుణె నటిస్తోంది.
ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ ఈ సినిమా తీస్తున్నారు. ప్రభాస్ 21వ సినిమాని భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ మూవీగా తీయనున్నారు.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్‌లను తెలుగు తెరపైకి పరిచయం చేసిన వైజయంతి మూవీస్ ప్రభాస్ 21వ సినిమా హీరోయిన్ పేరును ఓ వీడియో రూపంలో ప్రకటిస్తూ గతంలో తమ సంస్థ తీసిన సినిమాల్లో నటించిన హీరోయిన్ల పేర్లను కూడా గుర్తు చేసింది.