కువైట్‌లో గుండెపోటుతో మృతి చెందిన కడప జిల్లా వాసి
- 15 ఏళ్లుగా కువైట్‌లోనే ఉంటూ దర్జీ పనులు చేస్తున్న ఈశ్వర్ రెడ్డి
- ఈ నెల 13న గుండెపోటుతో మృతి
- చెన్నైకి చేరుకున్న మృతదేహం
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన లింగాల ఈశ్వర్ రెడ్డి (48) కువైట్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. టైలర్‌గా పనిచేస్తూ అక్కడే గత దశాబ్దంన్నరగా పనిచేస్తున్న ఆయన ఈ నెల 13న గుండెపోటుతో మరణించాడు. ఈశ్వర్ రెడ్డిది కడపలోని పెనగనూరు మండలం చక్రంపేట అని వైసీపీ కువైట్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు తెలిపారు.
కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఇమ్మిగ్రేషన్ పనులు, అవసరమైన ఇతర పేపర్ వర్క్ పూర్తిచేసిన అనంతరం మృతదేహాన్ని చెన్నైకి పంపించారు. అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ద్వారా ఆయన స్వస్థలం అయిన చక్రంపేటకు మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈశ్వర్‌రెడ్డి భార్య, కుమారుడు కూడా రెండేళ్ల క్రితం వరకు కువైట్‌లోనే ఉండగా ఆ తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చారు.