రాజస్థాన్ రాజకీయం.. గెహ్లాట్‌కు మళ్లీ మద్దతు ప్రకటించిన బీటీపీ ఎమ్మెల్యేలు
- రసవత్తరంగా మారిన రాజస్థాన్ రాజకీయాలు
- ఇటీవల ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు
- బలపరీక్ష నిర్వహించాల్సి వస్తే మాత్రం తటస్థం
రాజస్థాన్‌లో రాజకీయాలు రోజులు గడిచేకొద్దీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఇటీవల మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యేలు తిరిగి గెహ్లాట్‌తో కలిశారు. అయితే, ప్రభుత్వం కనుక బలపరీక్షకు సిద్ధపడితే మాత్రం తటస్థంగా ఉండాలని నిర్ణయించారు.
మరోవైపు, తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గంలో 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు తేలిపోవడంతో గెహ్లాట్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టమైంది. మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేలు ఇద్దరు తిరిగి గెహ్లాట్‌కు జై కొట్టడంతో ప్రభుత్వానికి మద్దతు మరింత పెరిగినట్టు అయింది.