బీ అలెర్ట్! దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ హెచ్చరిక

  • రోజుకు సగటున 30 వేల కేసులు నమోదవుతున్నాయి
  • పట్టణాలు, గ్రామాల్లోకి వైరస్ చొచ్చుకుపోతోంది
  • పరిస్థితి ఏమంత బాగోలేదు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని, ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఐఎంఏ హెచ్చరించింది. రోజుకు సగటున 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయని, ఇప్పుడు గ్రామాలకు కూడా కేసులు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

పట్టణాలు, గ్రామాల్లోకి వేగంగా చొచ్చుకుపోతున్న వైరస్‌ను నియంత్రించడం కష్టమైన పనేనని ఐఎంఏ హాస్పిటల్ బోర్డు ఆఫ్ ఇండియా డైరెక్టర్ వీకే మోంగా అన్నారు. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు రెండే మార్గాలు ఉన్నాయని, మొదటిది మొత్తం జనాభాలో 70 శాతం మందికి వైరస్ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుందని, రెండోది టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించడమని మోంగా వివరించారు.


More Telugu News