మాస్కు ధరించడంపై ట్రంప్ ప్రవచనాలు!

  • ఇటీవలే మొదటిసారి మాస్కు ధరించిన ట్రంప్
  • ప్రజలను ఒత్తిడి చేయబోనని వెల్లడి
  • స్వేచ్ఛ ఉండాలని భావిస్తున్నట్టు వ్యాఖ్యలు
అమెరికాలో కరోనా వ్యాప్తి మొదలైన మూడ్నెల్ల తర్వాత మాస్కు ధరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి కోసం మాస్కులు ధరించండి అంటూ దేశ ప్రజలను తాను ఆదేశించబోనని అన్నారు. ప్రజలకు మాస్కు ధరించే విషయంలో నిర్దిష్ట స్వేచ్ఛ ఉండాలని భావిస్తానని సెలవిచ్చారు. "ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తే కరోనా కనిపించకుండా పోతుంది అనే విషయం నేను అంగీకరించను" అంటూ స్పందించారు. అమెరికాకు చెందిన పలువురు వైద్య నిపుణులు గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

"మాస్కు ధరించవద్దని డాక్టర్ ఫాసి చెప్పారు. మా సర్జన్ జనరల్ ఓ తిరుగులేని నిపుణుడు... ఆయన కూడా మాస్కు వద్దనే చెప్పారు. కానీ మాస్కు వద్దన్నవాళ్లంతా ఇప్పుడు మాస్కు ధరించాలంటున్నారు. కానీ మాస్కుల వల్ల కూడా సమస్యలు వస్తాయి తెలుసా!" అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.


More Telugu News