కేంద్రం పిరికితనం వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: రాహుల్ గాంధీ
- కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తిన రాహుల్
- కేంద్రం చేతులు కట్టుకుని నిల్చుందంటూ విమర్శలు
- ఈ వైఖరితో చైనా మరింత రెచ్చిపోతుందన్న కాంగ్రెస్ అగ్రనేత
చైనాతో ఘర్షణల ఫలితంగా పదుల సంఖ్యలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి స్పందించారు. కేంద్రం పిరికి చర్యలతో దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. "చైనా మన భూభాగాన్ని లాగేసుకుంటోంది. భారత ప్రభుత్వం మాత్రం రాజభవనంలో చేతులు కట్టుకుని నిల్చునే అధికారి తరహాలో చోద్యం చూస్తోంది. భవిష్యత్తులో ఈ వైఖరి చైనాకు మరింత ధైర్యాన్నిస్తుంది" అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.