ఆన్ లైన్ లో ఓ గేమ్ ఆడితే 83 ఏళ్ల పాటు నెట్ ఫ్లిక్స్ ఉచితం!

  • ఇటీవల ఓటీటీలకు ప్రజాదరణ
  • బంపర్ ఆఫర్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్
  • విజేతకు 1000 నెలల సబ్ స్క్రిప్షన్ ఫ్రీ
కరోనా కాలంలో ఓటీటీలకు విపరీతమైన ప్రాధాన్యం పెరిగింది. సినిమాలు నేరుగా థియేటర్లలో రిలీజయ్యే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ వంటి ప్రత్యామ్నాయ వేదికలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, నెట్ ఫ్లిక్స్ సూపర్ డూపర్  ఆఫర్ ప్రకటించింది. అందుకోసం 'న్యూ ఓల్డ్ గార్డ్' అనే గేమ్ ఆడాల్సి ఉంటుంది. అత్యధిక పాయింట్లు స్కోరు చేసిన విజేతకు 1000 నెలల పాటు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ అందిస్తారు. అంటే సుమారు 83 ఏళ్ల పాటు ఎలాంటి చందా కట్టనవసరం లేకుండా ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ కంటెంట్ ను ఆస్వాదించవచ్చు.

ఇక్కడో విషయం గమనించాలి. ఈ ఆన్ లైన్ గేమ్ ఆడేముందు నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే 'ది ఓల్డ్ గార్డ్' అనే సినిమా చూస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందట. ఎందుకంటే, ఈ సినిమాలోని సన్నివేశాలే సదరు ఆన్ లైన్ గేమ్ కు ప్రాతిపదికగా వాడారట. ఇంకెందుకాలస్యం... ది ఓల్డ్ గార్డ్ సినిమా చూసి ఎంచక్కా గేమ్ ఆడేయండి!


More Telugu News