ఏపీలో కరోనా మహోగ్రరూపం... ఒక్కరోజే 52 మరణాలు, 3,963 పాజిటివ్ కేసులు

  • తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బీభత్సం
  • జిల్లాలో 12 మంది మృతి, 994 కొత్త కేసులు
  • తాజాగా రాష్ట్రంలో 1,411 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. అటు మరణాల సంఖ్య పెరగడమే కాకుండా, ఇటు కొత్తగా పాజిటివ్ వస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 52 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది చనిపోగా, గుంటూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 586కి పెరిగింది.

ఇక, కొత్తగా 3,963 మందికి పాజిటివ్ అని తేలింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 994 మందికి పాజిటివ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో 550, పశ్చిమ గోదావరి జిల్లాలో 407 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,609కి చేరింది. తాజాగా 1,411 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 22,260 మంది చికిత్స పొందుతున్నారు.


More Telugu News