క్వారంటైన్ సెంటర్లోని మహిళా పేషెంట్ పై అత్యాచారం
- మహారాష్ట్రలోని పన్వెల్ లో దారుణం
- 40 ఏళ్ల మహిళా పేషెంట్ పై అత్యాచారం
- విషయం తెలిసిన వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు
కరోనా కాలంలో కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. క్వారంటైన్ సెంటర్లలో కూడా అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పన్వెల్ లో దారుణం చోటుచేసుకుంది. కరోనా రోగులను, లక్షణాలు ఉన్నవారిని అక్కడి క్వారంటైన్ సెంటర్లో ఉంచుతున్నారు. 40 ఏళ్ల మహిళ కూడా కరోనా పాజిటివ్ తో అక్కడ చేరింది. ఒక వ్యక్తి అక్కడ ఆమెపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. అయితే ఆ కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పన్వెల్ జోన్-2 ఏసీపీ రవీంద్ర గీతే మాట్లాడుతూ, క్వారంటైన్ సెంటర్లో దాదాపు 400 మంది ఉన్నారని చెప్పారు. పాజిటివ్ తో అక్కడున్న మహిళపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని.. విషయం తెలిసిన వెంటనే అతడిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కొన్ని క్వారంటైన్ సెంటర్లలో సరైన ఆహారం కూడా అందించడం లేదని విమర్శించారు.