టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడిగింపు
- సింఘాల్ డిప్యుటేషన్ రెండో సారి పొడిగింపు
- 2017లో టీటీడీ ఈవోగా బాధ్యతల స్వీకరణ
- తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈవోగా కొనసాగాలని ఉత్తర్వులు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పదవిలో కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
2017 మేలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ డిప్యుటేషన్ పై వచ్చారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ లో రెసిడెంట్ కమిషనర్ గా పని చేశారు. టీటీడీ ఈవో కాలపరిమితి రెండేళ్లు. ఈ నేపథ్యంలో 2019లో ఆయన డిప్యుటేషన్ ను మరో ఏడాది పొడిగించారు. ఇప్పుడు తాజాగా రెండోసారి డిప్యుటేషన్ ను పొడిగించారు.
మరోవైపు తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గత కొన్ని రోజులుగా అనిల్ కుమార్ సింఘాల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ సూచనలను ఆయన పాటించడం లేదని, చంద్రబాబు దారిలోనే వెళ్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఆయన పదవీకాలాన్ని పొడిగించడం విశేషం.