న్యూస్‌ చదువుతుండగా ఊడిన పన్ను.. తీసి పట్టుకుని వార్తలు చదివిన యాంకర్.. వీడియో వైరల్

  • ఉక్రెయిన్‌లో  ఘటన
  • స్వయంగా వీడియో పోస్ట్ చేసిన యాంకర్
  • 20 ఏళ్లుగా తనకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని వ్యాఖ్య
వార్తలు చదువుతుండగా పన్ను ఊడిపోవడంతో, ఆ పన్నును కుడి చేతితో తీసి పట్టుకుని వార్తలు చదవడాన్ని కొనసాగించిందో యాంకర్.  ఉక్రెయిన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె వార్తలు చదువుతోన్న సమయంలో పన్ను ఊడినప్పటికీ ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా, వార్తలు చదవడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

తాను  20 ఏళ్లుగా వార్తలు చదువుతున్నానని, అయినప్పటికీ ఇటువంటి ఘటన తనకు ఎన్నడూ ఎదురు కాలేదని ఆమె తెలిపింది. ఇంట్లో తన కూతురు అలారం గడియారంతో ఆడుకుంటున్న సమయంలో అది ఒక్కసారిగా తన పంటిని తాకిందని దీంతో పన్ను కదిలిందని చెప్పింది.

దీంతో వార్తలు చదువుతోన్న సమయంలో అది ఊడిపోయిందని తెలుపుతూ ఆ యాంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంటూ ఈ వీడియోను పోస్ట్ చేసింది. వార్తలు చదువుతోన్న సమయంలో ఆమె చూపిన సమయస్ఫూర్తి వైరల్ అవుతోంది.      
             



More Telugu News