కరోనా ఏ స్థాయిలో ఉన్నా, బులెట్ల వంటి యాంటీ బాడీలు... రెండు నెలల్లో అందుబాటులోకి!

  • ఆసుపత్రికి వెళ్లే అవసరం రాదు
  • మోనోక్లోనల్ యాంటీ బాడీల తయారీ
  • మార్క్ జుకర్ బర్గ్ తో ఆంటోనీ ఫౌచీ
కరోనా సోకినా ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా, ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకునే రోజులు త్వరలో రానున్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్ ఫౌండర్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ తో లైవ్ లో జరిగిన ఆన్ లైన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ నాటికి కరోనాపై కచ్చితమైన తూటాల్లా పనిచేసే ఔషధాలను అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

 మోనోక్లోనల్ యాంటీ బాడీలపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని అన్నారు. తూటాల్లాంటి వీటిని నరం ద్వారా రోగి శరీరంలోకి పంపించాల్సి వుంటుందని, ఇవి అద్భుత పనితీరును చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. శరీరంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉన్నా, ఆసుపత్రికి వెళ్లకుండా చేసే ఔషధాల అవసరం ఎంతైనా ఉందని, మనకు అవసరమైన ఔషధాలు మార్కెట్లోకి వచ్చేంత వరకూ ప్రజలే తగు జాగ్రత్తలతో ఉండాలని సూచించారు. యువత అజాగ్రత్త కారణంగా వారే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని అభిప్రాయపడిన ఆంటోనీ ఫౌచీ, సామాజిక దూరం పాటించడం, మిగతా అన్ని జాగ్రత్తలూ తీసుకోవడాన్ని ఓ బాధ్యతగా భావించాలని అన్నారు.


More Telugu News