లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన వాయు కాలుష్యం

  • పెద్దమొత్తంలో తగ్గిన గాలిలో సూక్ష్మధూళి కణాలు
  • 630 అకాల మరణాలను అడ్డుకున్న వైనం
  • రూ. 5,173 కోట్ల వైద్య ఖర్చులు ఆదా
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారతదేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా వాయు కాలుష్యం విపరీతంగా తగ్గినట్టు బ్రిటన్‌లోని సర్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కాలుష్యం తగ్గడం వల్ల అకాల మరణాలు కూడా తగ్గాయని, 630 మరణాలను ఇది నివారించిందని అధ్యయనకారులు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు ‘‘సస్టైన్‌బుల్‌ సిటీస్‌ అండ్‌ సొసైటీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కాలుష్యంతో రోగాల బారినపడే ప్రజలు వైద్యానికి ఖర్చు చేసే దాదాపు రూ.5,173 కోట్లు ఆదా అయినట్టు అధ్యయనం వివరించింది. మార్చి 25 నుంచి మే 11 మధ్య కాలంలో నమోదైన వాయు కాలుష్య గణాంకాలను ఐదేళ్ల వ్యవధిలో నమోదైన గణాంకాలతో పోల్చి చూసినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. సూక్ష్మ ధూళి కణాలు ముంబైలో 10 శాతం, ఢిల్లీలో 54 శాతం తగ్గినట్టు గుర్తించారు. అలాగే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలలో 24 నుంచి 32 శాతం తగ్గినట్టు తేలింది.


More Telugu News