భారతీయ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాదారులపై ఆంక్షలను పాక్షికంగా సడలించిన ట్రంప్ సర్కారు
- నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాదారులపై ఇటీవల ఆంక్షల ప్రకటన
- వీసాదారులపై ఆధారపడిన వారు అమెరికా వెళ్లే అవకాశాలకు కత్తెర
- వీసాదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం
ఇటీవలే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాదారులపై డిసెంబరు 31 వరకు ఆంక్షలు విధించిన అమెరికా, తాజాగా ఆ ఆంక్షలను పాక్షికంగా సడలించింది. జూన్ 22 నాటి తన నిర్ణయాన్ని ట్రంప్ సర్కారు పునఃసమీక్షించింది. హెచ్1బీ, హెచ్4, జే1, హెచ్2ఏ, హెచ్2బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడినవారు అమెరికా వెలుపల ఉంటే డిసెంబరు 31 వరకు మళ్లీ అమెరికాలో ప్రవేశించే వీల్లేదని ప్రభుత్వం జూన్ 22న ప్రకటించింది.
అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై భారత ఇమ్మిగ్రెంట్ వీసాదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు వీసాదారులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అమెరికా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్1బీ, జే1 వీసాదారుల్లో కరోనా విధులు నిర్వర్తిస్తున్న వారితో పాటు, అమెరికా ప్రభుత్వం ప్రత్యేకించి కోరిన వారిని మాత్రమే అనుమతిస్తామంటూ ఆంక్షలను పాక్షికంగా సడలించింది.