ఏపీలో 72 లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు!

  • లాక్ డౌన్ కాలంలో అక్రమ మద్యం స్వాధీనం
  • కృష్ణా జిల్లాలో 10 పీఎస్ ల పరిధిలో 14 వేల బాటిళ్లు స్వాధీనం
  • మచిలీపట్నంలో మద్యం సీసాలు ధ్వంసం
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాక్ డౌన్ కాలంలో కృష్ణా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం సీసాలను ఇవాళ రోడ్డు రోలర్ తో తొక్కించారు. మచిలీపట్నంలో సుమారు 14 వేల అక్రమ మద్యం సీసాలను రోడ్డుపై క్రమపద్ధతిలో పేర్చి రోడ్డు రోలర్ సాయంతో పోలీసులు ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.72 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.



More Telugu News