ఓ వీడియో చూసి చలించిపోయిన చంద్రబాబు... ఏపీని దేవుడే కాపాడాలి అంటూ వ్యాఖ్యలు
- అంబులెన్స్ వీడియో పోస్టు చేసిన చంద్రబాబు
- జంతువుల్ని కుక్కినట్టు ఎక్కించారని వెల్లడి
- 108 కోసం చేసిన పబ్లిసిటీ అంతా దీనికోసమేనా అంటూ వ్యాఖ్యలు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ఏపీలో కేసులు పెరిగే కొద్దీ ప్రభుత్వం విఫలమవుతోందని అభిప్రాయపడ్డారు. ఏపీని ఒక ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ వీడియోనే కారణం.
ఓ గ్రామంలో కరోనా అనుమానితుడి కోసం అంబులెన్స్ రాగా, అంబులెన్స్ ఎక్కేందుకు తలుపులు తీయడంతో ఆ వ్యక్తి దిగ్భ్రాంతికి గురికావడం వీడియోలో చూడొచ్చు. ఎందుకంటే అప్పటికే ఆ అంబులెన్స్ లోపలి భాగం కరోనా అనుమానితులతో నిండిపోయింది. లోపల అంతమంది ఉంటే తానెక్కడ ఎక్కాలంటూ ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేయడం పట్ల చంద్రబాబు స్పందించారు.
"108 అంబులెన్స్ లో కరోనా అనుమానితులను జంతువులను కుక్కినట్టుగా ఎక్కించడం చూడ్డానికి భయానకంగా ఉంది. 108 కోసం చేసిన పబ్లిసిటీ అంతా దీనికోసమేనా! ఇదంతా చూస్తుంటే, ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని భావించాల్సి వస్తుంది. ఆ దేవుడే ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలి" అంటూ ట్వీట్ చేశారు.