సచిన్ పైలట్ ను దెబ్బతీసేందుకు వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారు: భగ్గుమన్న బీజేపీ మిత్రపక్షం

  • గెహ్లాట్ కు, ఆమెకు మధ్య స్పష్టమైన అవగాహన ఉంది
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె రక్షిస్తున్నారు
  • పైలట్‌కు మద్దతు ఇవ్వొద్దంటూ చెబుతున్నారు 
బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్‌పీ) తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయ సంక్షోభంతో రాష్ట్రం ఉడికిపోతున్నా ఆమె నోరు విప్పడం లేదని విరుచుకుపడింది. గెహ్లాట్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని, సీఎంకు, ఆమెకు మధ్య అవగాహన ఉందని ఆర్ఎల్‌పీ ఎంపీ హనుమాన్ బెనీవాలా ఆరోపించారు. సచిన్ పైలట్ తిరుగుబాటు శిబిరాన్ని దెబ్బతీసేందుకు ఆమె యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని మరీ మాట్లాడుతున్నారని, ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. పైలట్‌కు మద్దతు ఇవ్వొద్దంటూ శిఖర్, నాగూర్‌లోని జాట్ వర్గ ఎమ్మెల్యేలను ఆమె ఆదేశించారని పేర్కొన్నారు. బేనీవాలా ఆరోపణలపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియా స్పందించారు. అందరికీ గౌరవనీయమైన నాయకురాలైన వసుంధరపై బేనీవాలా ఆరోపణలు సరికాదని హితవు పలికారు.


More Telugu News