దళిత కుటుంబాల పక్షాన నిలవడమే ఆ న్యాయమూర్తి చేసిన తప్పా?: చంద్రబాబు
- చిత్తూరు జిల్లాలో న్యాయమూర్తి రామకృష్ణపై దాడి
- తీవ్రంగా ఖండించిన చంద్రబాబు
- దళిత మేధావులు ఒక్కటవ్వాలని పిలుపు
చిత్తూరు జిల్లాలో రామకృష్ణ అనే జడ్జిపై జరిగిన దాడి ఎంతో నీచమైన చర్య అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. న్యాయమూర్తి రామకృష్ణ చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే... వైసీపీ గూండాలు, కబ్జాదారులు దళితుల అసైన్ మెంట్ భూములను లాగేసుకుంటుంటే, ఆ దళిత కుటుంబాల పక్షాన నిలవడమేనని తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. దళిత మేధావులపై జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇదొకటని, గతంలో మాజీ ఎంపీ హర్షకుమార్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితా రాణి, మహాసేన రాజేశ్ తదితరులపైనా ఇలాగే దాడులు జరిగాయని వివరించారు.
దళితులకు న్యాయం నిరాకరించడం, హింస, బెదిరింపులతో వారి గొంతు నొక్కాలని ప్రయత్నించడం యావత్ సమాజానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఓ పేలవమైన ఉదాహరణగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ విపరీత చర్యలను దళిత మేధావి వర్గం సంఘటితంగా ఎదుర్కోవాలని, న్యాయబద్ధంగా తమ హక్కులను సాధించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.