అదంతా దుష్ప్రచారం.. ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని తగ్గించడంలేదు: ఏపీ సీఎంఓ

  • వయోపరిమితి తగ్గిస్తున్నారంటూ వార్తలు
  • సీఎంవోను సంప్రదించిన ఉద్యోగ సంఘాల నేతలు
  • అసత్య ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయన్న సీఎంఓ   
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని తగ్గిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్పందించారు. ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని మార్చడంలేదంటూ స్పష్టం చేశారు.

ఇదంతా దుష్ప్రచారమనీ, వయోపరిమితి అంశంలో ఎలాంటి చర్యలు ఉండబోవని వివరించారు. దీనిపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని సీఎంఓ హెచ్చరించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికస్థితిని దృష్టిలో ఉంచుకుని వయోపరిమితిపై కసరత్తు జరుగుతోందంటూ వార్తలు రావడంతో సీఎంఓ పైవిధంగా వివరణ ఇచ్చింది.


More Telugu News