ఇన్ఫోసిస్ అండతో దూసుకుపోయిన మార్కెట్లు
- త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించిన ఇన్ఫోసిస్
- 9.56 శాతం పెరిగిన ఇన్ఫీ షేర్
- 420 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి గాను భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలకు మించి రాణించడంతో... మార్కెట్లలో జోష్ నెలకొంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 420 పాయింట్లు పెరిగి 36,472కి ఎగబాకింది. నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 10,740కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (9.56%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.81%), నెస్లే ఇండియా (3.31%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.98%), హీరో మోటో కార్ప్ (2.47%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.54%), ఐటీసీ (-2.34%), ఎన్టీపీసీ (-1.42%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.04%), టైటాన్ కంపెనీ (-0.88%).