ఏపీలో పెరిగిన కరోనా మృతుల సంఖ్య... 24 గంటల్లో 40 మంది మరణం

  • రాష్ట్రంలో 492కి చేరిన కరోనా మృతుల సంఖ్య
  • ఏపీలో కొత్తగా 2,593 మందికి పాజిటివ్
  • 943 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతి మరింత తీవ్రమైంది. గత కొన్నిరోజులుగా మరణాల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో ఈ ప్రమాదకర వైరస్ బారినపడి 40 మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 492కి పెరిగింది.

తాజాగా, 2,593 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 590, తూర్పు గోదావరి జిల్లాలో 500 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 38,044కి చేరింది. 943 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 18,159 మంది చికిత్స పొందుతున్నారు.


More Telugu News