రాష్ట్రపతిని కలిసి జగన్ సర్కారుపై ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు
- రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన టీడీపీ ఎంపీలు
- వేధింపులకు పాల్పడుతున్నారంటూ రాష్ట్రపతికి నివేదన
- రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటూ ఫిర్యాదు
టీడీపీ ఎంపీలు ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ టీడీపీ ఎంపీల బృందం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. తప్పుడు పాలన, అవినీతి, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కడం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై కత్తెర, విపక్ష నేతలను తీవ్రస్థాయిలో వేధించడం వంటి అంశాలను టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి నివేదించారు. గత 14 నెలలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ విధంగా వ్యవహరిస్తోందంటూ రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు.